కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
భారీసంఖ్యలో కాంగ్రెస్‌లో చేరిన కేఆర్‌కే కాలనీవాసులు
కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికిన కేఎస్ఆర్
ఆదిలాబాద్ః కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 8 కేఆర్‌కే కాలనీవాసులు భారీ ఎత్తున శ్రీరామ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అధికారంలోకి రాగానే కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ఇళ్లులేని నిరుపేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న అనుచరులు భూములన్నింటినీ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతున్న జోగు రామన్నను చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇచ్చిన హామీలను విస్మరించి మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివరకు అర్హులైనవారికి రేషన్ కార్డు ఇప్పించలేదని, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రజల సంక్షేమానికి చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. పాయల శంకర్, జోగు రామన్న ఇద్దరూ ఒక్కటేనని, వారిద్దరిలో ఎవరికీ ఓటువేసిన మళ్లీ అభివృద్ధికి ఆటంకం తప్పదని హితవు పలికారు. జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఆదిలాబాద్‌ను ప్రగతిపథంలో నిలుపుతానని, అందుకు అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భరత్ వాగ్మారే, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, ఆదివాసీ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సెడ్మకి ఆనంద్ రావు, ఐనేని సంతోష్‌రావు, నాగర్కర్ శంకర్, షకీల్, సుజాత్ అలీ, తిరుమల్ రెడ్డి, కొండూరి రవి, అల్లూరి అశోక్ రెడ్డి, షేక్ మన్సూర్, బూర్ల శంకర్, ముఖీమ్, అమ్జద్ ఖాన్, కర్మ, అస్బాత్ ఖాన్, అఖీమ్, కృష్ణ, అశోక్, సమీఉల్లా ఖాన్, షేక్ షాహిద్,షేక్ జాకీర్,షేక్ తైమూర్, సంతోష్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి, బండి కిష్టన్న, ఎల్మ గంగా రెడ్డి, బాసా సంతోష్, లింగన్న, ఎలాల్ సంజీవ్ రెడ్డి, రమాకాంత్, ఆశారెడ్డి, మహమూద్, సుభాష్ రెడ్డి, కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.