కరీంనగర్: కేసీఆర్ (KCR) శకం ముగిసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(Jeevan Reddy) సెటైర్లు వేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ పాలనలో దళితులు బీసీలకు అన్యాయం జరుగుతోంది. సీఎం కేసీఆర్ పాత హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలను తెరమీదకి పట్టుకువచ్చారు. కేసీఆర్‌ను ప్రజలు నమ్మడం లేదు. దళితులకు బడ్జెట్లో కేటాయించిన 17 వేల కోట్లు పక్కదారి పట్టాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
