నగరంలోని చైతన్యపురి జంక్షన్ వద్ద రోడ్డుపై భారీ గుంతపడింది. ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోయింది. దాదాపు రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రోడ్డుపై గుంత కారణంగా ఆ మార్గంలో వాహనాలు మెల్లిగా కదులుతున్న పరిస్థితి. భారీ ట్రాఫిక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
