AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్.. భారత జట్టులో కీలక మార్పు.. అశ్విన్ ఔట్..

క్రికెట్ వన్డే ప్రపంచకప్‌ (ICC Cricket World Cup)లో రెండో మ్యాచుకి రెడీ అయింది టీమిండియా. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది రోహిత్ సేన. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్థాన్. శుభ్‌మన్ గిల్ ఇంకా కోలుకోకపోవడంతో ఇషాన్ కిషనే ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. ఇక.. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ని జట్టులో తీసుకుంది. ఇక.. ఆఫ్ఘన్ జట్టు ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది.

భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి మాంచి ఊపు మీదుండగా.. తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో పరాజయం పాలైన అఫ్ఘాన్‌ టీమ్‌ భారత్‌పై సంచలనం నమోదు చేయాలని భావిస్తోంది. ప్రపంచకప్ 2023 ఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక కూడా 300 ప్లస్ రన్స్ చేసి ఓటమిపాలైంది. దీంతో ఫ్యాన్స్ కు మరో సారి పరుగుల విందు ఖాయమని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

తొలి మ్యాచ్‌లో చెత్త షాట్‌తో విఫలమైన శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఓపెనర్లుగా మరోసారి రోహిత్, ఇషాన్ బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఐదో స్థానంలో రాహుల్ బరిలోకి నిలవనున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ ప్లే చేయనున్నాడు. ఈ మ్యాచులో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్‌కు పరిమితం కాగా.. ఎక్స్ ట్రా పేసర్ గా శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఇక.. కొత్త బంతిని సిరాజ్, బుమ్రా పంచుకోనున్నారు.

వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. అయినప్పటికీ ఆ జట్టును తేలికగా తీసుకోవద్దనేది విశ్లేషకుల మాట. ఆఫ్ఘాన్ తనదైన రోజున పెద్ద పెద్ద జట్లకు సైతం షాకివ్వగలదని హెచ్చరిస్తున్నారు. ఆ జట్టులో కూడా రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫజల్ హక్ ఫరూఖీ వంటి కీలక ప్లేయర్లున్నారు. వాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు

తుది జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

ఆఫ్ఘనిస్థాన్: రహ్మనుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమ్రజాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూఖీ

ANN TOP 10