AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి పార్టీలో హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న జానారెడ్డిని రంగంలోకి దింపడం ద్వారా ఆయన సేవలను హైకమాండ్ పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు సిద్ధమైంది. జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్ మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో జానారెడ్డితో పాటు మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లను అధిష్టానం నియమించింది. ఈ కమిటీకి పార్టీ హైకమాండ్ కీలక టాస్క్ అప్పగించింది. పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత టికెట్ రానివారిని, పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతలు అప్పగించింది. బుధవారం జానారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గాంధీ భవన్ లో సమావేశంకానున్నారు. టికెట్ల కేటాయింపునకు ముందే టికెట్ కోసం పోటీ ఉన్న నియోజకవర్గాల పై ఈ కమిటీ దృష్టిసారించనుంది. తద్వారా టికెట్ దక్కని వారిని బుజ్జగించడం ద్వారా వారు పార్టీని వీడకుండాఉండేలా జానారెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ చర్యలు తీసుకోనుంది.

కాంగ్రెస్ పార్టీలో టికెట్లకోసం చాలా నియోజకవర్గంలో పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు, పాత నేతలు టికెట్ కోసం గట్టిగానే అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేతల మధ్యకూడా టికెట్ల కోసం పోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తుంది. టికెట్లు దక్కని కొందరు నేతలు పార్టీని వీడే అవకాశాలు ఉండటంతో వారిని బుజ్జగించి పార్టీలో కొనసాగేలా అధిష్టానం ముందుగానే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీనియర్ నేత జానారెడ్డి సేవలను అధిష్టానం వినియోగించుకోనుంది.

ANN TOP 10