AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటిసారి తెలంగాణకి అమిత్ షా

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) రానున్నారు. ఈమేరకు బీజేపీ పార్టీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రేపు మధ్యాహ్నం 1.45గంలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 3గంటల‌ నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలో అమిత్ షా ప్రసగింస్తారు. సభ అనంతరం 5.15గంలకు హెలికాప్టర్‌లో బేగంపేట్‌కు చేరుకుంటారు. బేగంపేట్ ఐటీసీ కాకతీయ హోటల్‌కు అమిత్ షా వెళ్తారు. సాయంత్రం 6.20గంలకు సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లో మేధావులతో సమావేశం అవుతారు. మేధావుల సమావేశం తర్వాత కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. రాత్రి 7.30 కు ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్‌కు ఎన్నికల వ్యూహాలపై అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు.

ANN TOP 10