తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఢిల్లీలో ఆకాశవాణి భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలును ఇవాళ విడుదల చేశారు. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపింది. నవంబర్ 30 న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
ఎన్నికల షెడ్యూల్ ముఖ్యమైన తేదీలు
నవంబర్ 3న నోటిఫికేషన్
నవంబర్ 10 వరకు నామినేషన్లు
నవంబర్ 13న స్క్రూట్నీ
నవంబర్ 15 లోపు నామినేషన్ల విత్ డ్రా
నవంబర్ 30న ఎన్నికలు
డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు