పరకాల అసెంబ్లీ బరిలో మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు నిలవనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం అశోక్ యత్నం చేస్తున్నారు. దండకారణ్య కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1991లో మావోయిస్టుల్లో చేరిన అశోక్.. 2016 లో అనారోగ్య కారణాలతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. నేడు అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ జోడో యాత్రతో స్పూర్తి పొందానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రజలను పీడిస్తున్నాయని అశోక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. పరకాలలో ప్రజలను నాయకులు పీడిస్తున్నారన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చింది సేవ చేయడానికేనని అశోక్ తెలిపారు.
