తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. ఈ నెల 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా అధికారిక షెడ్యుల్ ఖరారైంది. ఎల్లుండి ఒకే రోజు తెలంగాణలో అమిత్ షా రెండు సభలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తారు. మోదీ కూడా కొద్దిరోజుల క్రితం ఒక రోజు గ్యాపుతో రాష్ట్రానికి వచ్చి పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో మోదీ పంచుల వర్షం కురిపించిన విషయం విదితమే. ఇప్పుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన ఆసక్తికరంగా ఉండేలా రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
