తన వ్యక్తిగత భద్రతను చూసే గన్‌మ్యాన్‌పై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చేయి చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గన్‌మ్యాన్‌ను ఆయన కొట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అన్ని రాజకీయ పార్టీల నుండి హోంమంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కవిత స్పందిస్తూ… ఈ సంఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
