స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫాం కర్మగారానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు హరీష్ రావు. ఇందులో భాగంగా… ఈ వయసులో చంద్రబాబుని అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు.
“పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ చేశారు.. ఇది దురదృష్టకరం.. ఈ వయసులో ఆయనను చేయడం మంచిది కాదు” అని అన్నారు హరీశ్. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేవి కానీ… ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు అని చెప్పే సందర్భంలో హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు గిన్నెలపై గరిటెలతో కొట్టడం, గంటలు వాయించడం, విజిల్స్ వేయడం, హారన్లు మోగించడం వంటి శబ్ధాలు చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి “మోత మోగిద్దాం” అనే నామకరణం చేశారు.