AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళాను చితకబాదిన స్పా మేనేజర్

అహ్మదాబాద్ లో తన వ్యాపార భాగస్వామి అయిన మహిళపై దాడి చేసి చితకబాదాడు. బహుళ అంతస్తుల భవనంలో స్పా ఆవరణలో టెర్రాస్ పై మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లడం, ఆమెపై చేయి చేసుకోవడం, చెంపలు పగులగొట్టడం ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇలా నాలుగు నిమిషాల పాటు ఆ మహిళపై దాడి కొనసాగినట్టు తెలుస్తోంది. స్పా నిర్వాహకుడు మోహిసిన్ ఆ మహిళను బలవంతంగా స్పా లోపలికి ఈడ్చుకుపోవడం చూడొచ్చు. కొంత వ్యవధి తర్వాత ఆ డోర్ ను తన్నుకుని మహిళా బయటకు వచ్చింది. ఆమె కుర్తా చినిగిపోయి పేలికలుగా కనిపిస్తోంది. దుస్తులు చినిగేంతగా అతడు ఆమెపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూసే వారి మనసును కదిలించే విధంగా ఉంది. ఈ ఘటన ఈ నెల 25న జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చేరి, వైరల్ గా మారిపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. గెలాక్సీ స్పా నిర్వాహకుడు మోహిసిన్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ దాడి జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ బాధిత మహిళ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. సోషల్ వర్కర్ సాయంతో సదరు మహిళను పోలీసులు సంప్రదించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10