ముఖ్యమంత్రి కేసీఆర్ విపరీతమైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రగతి భవన్‌లో యశోద హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో సీఎం కేసీఆర్‌కు వైద్యం అందుతోందని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సాధారణ స్థితికి చేరుకుంటారని సమాచారం. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది.
ఇదే విషయాన్ని సీఎం తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా నిర్ధారించారు. ట్విటర్ వేదికగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ‘‘ సీఎం కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఆయనకు మెడికల్ బృందం ఇంటి వద్దే చికిత్స అందిస్తోంది. చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే సీఎం కేసీఆర్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారు’’ అని కేటీఆర్ ట్విట్ చేశారు.