AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీ విలీనంపై షర్మిల సంచలన నిర్ణయం..! కాంగ్రెస్‌కు డెడ్‌లైన్

పార్టీ విలీనంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 30లోగా విలీనంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లేదంటే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. 33 జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అక్టోబర్ రెండో వారం నుంచి నేతలు ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు.

కాంగ్రెస్ హైకమాండ్‌కి షర్మిల డెడ్ లైన్..
పార్టీ విలీనంకి సంబంధించి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఒక డెడ్ లైన్ విధించారని చెప్పొచ్చు. వైఎస్ఆర్ టీపీ కార్యవర్గ సమావేశంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా చర్చలు జరిపారు.

ఒంటరిగా బరిలోకి దిగే ఛాన్స్..
అయితే పార్టీ విలీనంకి సంబంధించి షర్మిల ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రావడం లేదని వైఎస్ఆర్ టీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని షర్మిల భావిస్తున్నారు. ఈ నెల 30లోపు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి విలీనంపై స్పష్టమైన సానకూలత వస్తే సరేసరి లేదంటే తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం..
కార్యవర్గ సమావేశంలో నేతలు, కార్యకర్తలకు షర్మిల ఇవే సంకేతాలు ఇచ్చారు. 30వ తేదీ వరకు వేచి చూద్దాం, ఆలోపు కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన వస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేద్దాం. అలా కాకుండా కాంగ్రెస్ అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోతే 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు నేతలు, కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు షర్మిల.

ANN TOP 10