అనేక సామాజిక సేవలతో ముందుడుగు
ప్రజల మన్ననలు అందుకుంటున్న శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్: అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పేదల పెన్నిధిగా..ప్రజాబాంధవుడిగా ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న కంది శ్రీనివాసరెడ్డి మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతున్నారు. సేవే లక్ష్యం..సేవే మార్గం అన్న నినాదంతో సేవలందిస్తూ జనం ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. సంపాదించిన డబ్బులతో మనం ఒక్కరమే బతకడం కాదు..అందులో కొంతైన ప్రజలకు ఖర్చుచేసి ఏదైన మంచి చేయాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వరదలు ముంచెత్తిన సమయంలో ఆపన్నులు, అభాగ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి బాసటగా నిలిచారు. ఆపదలో ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. వివాహం చేసుకుని ఒక్కటైన నూతన జంటలను నిండు మనస్సుతో ఆశీర్వదించి కంది శ్రీనన్న పెళ్లి కానుకలు బహూకరించారు.. ఇలా ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని తాను పుట్టిన గడ్డకు ఏదైన చేయాలనే సంకల్పంతో ఆదిలాబాద్‌కు వచ్చారు.
కేఎస్‌ఆర్ ఫౌండేషన్ స్థాపించి సేవలందిస్తున్నారు. ఇటీవల రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రెషర్ కుక్కర్ల పంపిణీని ప్రారంభించారు. మహిళలను తన తోబుట్టువుగా భావించి వారికి ఈ చిరు కానుకలను అందజేస్తూ వారి కళ్లలో ఆనందం చూస్తున్నారు. ఈ కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోంది. ఇప్పటికే ఎన్నో కాలనీల్లో పంపిణీ కార్యక్రమం పూర్తయ్యింది. ప్రతి ఇంటికీ…ప్రతి గడపకు ప్రెషర్ కుక్కర్లను చేరవేస్తూ వారి ఆశీర్వచనలు అందుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ మంచి పోషకాలు అందాలనే ఉద్దేశంతోనే వీటిని పంపిణీ చేస్తున్నట్టుగా ఆయన చెబుతున్నారు.