టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి వచ్చింది. గత ఏడాదిగా వరుసగా పట్టుబడుతున్న సినిమా వాళ్లను చూస్తే ఇండస్ట్రీలో డ్రగ్స్ ఏ స్థాయిలో కుదిపేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. ఈ కేసు పై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. ఇందులో టాలీవుడ్ కి చెందిన అగ్ర దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లు విచారణ ఎదుర్కొన్నారు. టాలీవుడ్ హీరో రవితేజ, రానా, నవదీప్,తరుణ్, తనీష్, సుబ్బరాజుతో పాటు హీరోయిన్లు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్ తోపాటు దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు తరచుగా డ్రగ్స్ కేసులో పట్టుబడడం కలకలం సృష్టిస్తుంది. 2017 కేసులో పట్టుబడ్డ వ్యక్తులు మరోసారి పట్టుబడటంతో డ్రగ్స్‌కు ఏ రకంగా బానిసలుగా మారుతున్నారు అర్థం చేసుకోవచ్చు.
ఇదే క్రమంలో హీరో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించిన నార్కోటిక్ పోలీసులు ఆయన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ పోలీసుల దర్యాప్తుకు హాజరు కంటే ముందు ఆయనే మొబైల్లో ఉన్న ఆధారాలన్నిటిని చెరిపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత నార్కోటిక్ పోలీసులు నవదీప్ ను మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు ఆయనే రెండు ఫోన్లో ఫార్మర్ చేసిన వివరాలు బయటకు వస్తే ఇండస్ట్రీలో ఉన్న మరి కొంతమంది పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. మరోవైపు బస్తీ సినిమా నిర్మాత మంతెన వాసుతో పాటు రైటర్ పృథ్విని కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంతెన వాసు పోలీసులు సోదాలు చేసేటువంటి క్రమంలో అప్పటికే డ్రగ్స్ తీసుకుని ఉన్నట్టుగా తేలడంతో ఆయనను కన్జ్యూమర్‌గా చేర్చారు పోలీసులు. అలాగే రైటర్ పృథ్వి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులతో కలిసి కూకట్‌పల్లి పోలీసులు దాడులను నిర్వహిస్తే ఆయన నివాసంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు తరచుగా డ్రగ్స్ కేసులో పట్టుబడడం సంచలనం సృష్టిస్తుంది. డ్రగ్స్ అంశం ఎప్పుడు తరం మీదికి రావడంతో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు పట్టుబడడం సాధారణంగా మారింది.