తెలంగాణ సెట్ (TS – SET-2023) నోటిఫికేషన్ ను ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కాగా.. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగిసింది. అయితే రూ.2000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 18 వరకు అవకాశం కల్పించారు. ఈ గడువు కూడా ముగిసింది. ఇక రూ.3 వేలు ఆలస్య ఫీజుతో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. నేటితో వీటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఇటీవల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 12తో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని పేర్కొనగా.. వాటి తేదీలను మార్చారు.
కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2 పరీక్ష 100 ప్రశ్నలకు 300 మార్కులను కేటాయించనున్నారు. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇతరత్రా సమాచారం కోసం www.telanganaset.org, www.osmania.ac.in అనే వెబ్‌సైట్లను సందర్శించొచ్చు.