AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కించపరిచేలా ఎవరు మాట్లాడినా ఒప్పుకోం..

కోమటిరెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హెచ్చరిక

హైదరాబాద్‌: చెరుకు సుధాకర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరింపులపై టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్‌ స్పందించారు. దిగజారుడు వ్యాఖ్యలు సరికాదని, పార్టీలో ఎవరిని కించపరుస్తూ మాట్లాడినా ఒప్పుకోబోమని వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్‌ను చంపుతానని బెదిరిస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. కోమటిరెడ్డి వర్సెస్ చెరుకు సుధాకర్ మధ్య వార్ తారస్థాయికి చేరుకుంది. పోటాపోటీగా ఇద్దరూ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో టీ కాంగ్రెస్‌లో ఆడియో లీక్ వ్యవహారం చిచ్చు రేపుతోంది.

ఈ క్రమంలో ఫోన్‌లో చెరుకు సుధాకర్‌కు వెంకటరెడ్డి చంపుతానంటూ బెదిరించడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. ఎవరు.. ఎవరిని కించపరిచేలా మాట్లాడినా ఒప్పుకోబోమని హెచ్చరించారు. స్థాయి దిగజారి మాట్లాడటం సరికాదని సూచించారు. ఏ నేత అయినా నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు. వెంకటరెడ్డి లాంటి సీనియర్ నాయకులు అలా మాట్లాడటం సమర్థనీయం కాదని, సొంత పార్టీ నేతపైనే విమర్శలు చేయడం సరికాదని మహేష్ గౌడ్ తెలిపారు.

చెరుకు సుధాకర్‌ తనను విమర్శిస్తూ వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వస్తుండటంపై ఆయన కుమారుడు చెరుకు సుహాస్‌కు ఫోన్ చేసి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తనను విమర్శిస్తే తన నుంచి సహాయం పొందినవారు ఊరుకోరని, చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నట్లు బెదిరించారు. నిన్ను కూడా చంపుతారని, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలని సుహాస్‌ను కూడా వెంకటరెడ్డి బెదిరించారు. నీ హాస్పిటల్ కూడా ఉండదని, ఆస్పత్రిని కూలగొడతారని తెలిపారు. తనను నెల రోజుల నుంచి విమర్శిస్తూ వస్తున్నారని, తన అభిమానులను ఇక ఆపలేనని చెప్పారు. ఇప్పటివరకు ఒపిక పట్టుకుంటూ వచ్చానని, ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే చంపేస్తారని వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ANN TOP 10