AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఢిల్లీకి వైఎస్‌ షర్మిల?

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీని విలీనం చేయాలని షర్మిల ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా.. ఆమె సేవలను ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై స్పష్టత రావట్లేదు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం.. షర్మిల చేరికను వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ షర్మిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ వారంలోనే కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై స్పష్టత రానున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

ANN TOP 10