AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్ లో కంది వినూత్న కార్యక్రమం

మీ బిడ్డను ఆశీర్వదించండి : కంది శ్రీనివాస‌రెడ్డి
మీ దీవెనలే నా బలం
ఇంటింటికీ ప్రెషర్ కుక్కర్
ఆదిలాబాద్ : ఇంటింటికి ప్రెషర్ కుక్కర్ అందిస్తూ కంది శ్రీనివాస‌రెడ్డి మహిళల దీవెనలు అందుకుంటున్నారు. ఆదిలాబాద్ తల్లుల దీవెనలే తన బలం అని ఈ సందర్భంగా కంది శ్రీనివాస‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని వార్డ్ నెం 31 అంబేద్కర్ నగర్ కాలనీలో కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ కంది శ్రీనివాస రెడ్డి ప్రెషర్ కుక్క‌ర్లు పంపిణీ చేసారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవచేయాలన్న ఉద్దేశంతోనే ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడ్తున్నామని స్ప‌ష్టం చేసారు.అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవచేయాలనే ఇక్కడికొచ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు. సాధారణ రైతుకుటుంబంలో పుట్టి పెరిగిన త‌ను సొంత కష్టం తోనే ఈ స్థాయికొచ్చిన‌ట్టు తెలిపారు.

స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్నిరకాల పౌష్టికాహార లోపాలను దూరం చేయాలనుకొన్న ఉద్దేశంతో త‌న స‌తీమ‌ణి ఇచ్చిన స‌ల‌హాతో ప్రెష‌ర్ కుక్కర్ల పంపిణీకి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు.రాజకీయాలక‌తీతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.త‌న ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఎమ్వెల్యే జోగు రామన్న పలు కుట్రలు ప‌న్నుతున్న‌ట్టు ఆరోపించారు.త‌మ కాల‌నీకి వ‌చ్చి ప్రెష‌ర్ కుక్క‌ర్లు పంచిన కంది శ్రీ‌నివాస రెడ్డి సేవాగుణాన్ని కొనియాడుతూ కాల‌నీ వాసులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.కార్యక్రమంలో గిమ్మ సంతోష్,నాగర్కర్ శంకర్, ఎంఏ షకీల్, కొండూరి రవి, ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ, అస్బాత్ ఖాన్, పుండ్రు రవి కిరణ్ రెడ్డి,ఎల్మ గంగ రెడ్డి,బండి కిష్టన్న, సంతోష్ రెడ్డి,గడ్డం రామ్ రెడ్డి,లింగన్న,హరీష్ రెడ్డి,మహమూద్,సోమగారి వెంకటేష్,బబ్లు ఖాన్,షేక్ అతిక్, ఆరిఫ్ ఖాన్,మున్ని బాయి,అర్బాజ్ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10