తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ ప్రకటించింది. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురిసే వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. దీంతో పాటు హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
