సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, మాజీ సారథి విరాట్ కోహ్లి తదితరులు తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడం లేదు. వీరికి విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఇక చాలా రోజుల తర్వాత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వన్డే టీమ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో అందరి దృష్టి అతనిపైనే నిలిచింది. అక్షర్ పటేల్ గాయపడడంతో అశ్విన్‌కు ఛాన్స్ దక్కింది. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో అశ్విన్ ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అశ్విన్ ఈ సిరీస్‌లో జట్టుకు కీలకంగా మారాడు. కెప్టెన్ రాహుల్‌కు కూడా సిరీస్ కీలకమేనని చెప్పాలి.
గిల్‌పైనే ఆశలు..
మరోవైపు ఆసియాకప్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో జట్టుకు కీలకంగా మారాడు. కొన్ని రోజులుగా గిల్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. ఆసియాకప్‌లో కూడా అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఈ సిరీస్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. రోహిత్, కోహ్లి వంటి స్టార్లు దూరంగా సమయంలో గిల్ బాధ్యత మరింత పెరిగింది. ఇషాన్ కిషన్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఇషాన్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
సూర్యకు సవాల్..
ఇక వన్డేల్లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఆస్ట్రేలియా సిరీస్ సవాల్‌గా మారింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది. కొంతకాలంగా సూర్య వరుసగా విఫల మవుతున్నాడు. అయినా అతనికి సెలెక్టర్లు తరచూ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. అయితే అతను మాత్రం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. రానున్న వరల్డ్‌కప్ నేపథ్యంలో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన ఒత్తిడి సూర్యపై ఉంది. ఇందులో అతను ఎంతవరకు సఫలం అవుతాడనే దానిపైనే అతని వన్డే భవితవ్యం ఆధారపడి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్‌కు కూడా సిరీస్ కీలకంగా మారింది.