-
- తమకు ఎలాంటి రిపోర్ట్ రాలేదన్న ప్రీతి తండ్రి
కాగా.. ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్ అనే మత్తు ఇంజెక్షన్ వయల్స్ పడి ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె శరీరంలో ఆ మందుల అవశేషాలతో పాటు, వేరేవైనా విషాలు ఉన్నాయా తెలుసుకునేందుకు హైదరాబాద్ డాక్టర్లు నమూనాలు సేకరించి టాక్సికాలజీ పరీక్షకు పంపారు. పదిరోజుల తర్వాత.. ఆ నివేదిక ఆదివారం వరంగల్ పోలీసులకు చేరింది. ప్రీతి శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రసాయనాలూ కనిపించలేదని ఆ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంలో ఎలాంటి నిర్ధారణకూ రాలేని పరిస్థితి. ఆమె తల్లిదండ్రులేమో.. తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్ ఫోన్ కాల్‌డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు.