AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజలకు సీఎం కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం వినాయక చవితి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా’ అంటూ శుభం కలుగాలని ఏకదంతున్ని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక సాంసృతిక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని సీఎం సూచించారు.

గణనాథుడి ఆశీస్సులతో అనేక విఘ్నాలు అధిగమిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోధరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. నవరాత్రులతోపాటు, నిమజ్జనం సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ANN TOP 10