కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్యారంటీ హామీలను ప్రకటించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా మెజారిటీ హామీలు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీ హామీలతో పాటు సోనియాగాంధీ ప్రకటించిన మొత్తం ప్రకటించిన హామీల లిస్టు ఇదే..
కీలక ప్రకటనలు ఇవే
1. మహాలక్ష్మి పథకం..
– మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
– పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్
– ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
2. రైతు భరోసా..
– ప్రతీ ఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు
– వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు
-వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్
3. ఇందిరిమ్మ ఇళ్ల పథకం
– ఇందిరిమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
– తెలంగాణ ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం
4. గృహజ్యోతి పథకం
గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
5. చేయూత పథకం
– చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా
– చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్
6. యువ వికాసం
– యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5లక్షల వరకు సాయం.
రాహుల్ గాంధీ
తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. రాజకీయాల్లో ఎవరితో పోరాడుతున్నామో అవగాహన ఉండాలి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుంది. ఒక్క కుటుంబం కోసమే సోనియా తెలంగాణ ఇవ్వలేదు. రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ ఇచ్చారు. BRS పాలనలో పేదలకు మేలు జరగలేదు. ప్రజలకు గ్యారంటీ తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను నెరవేరుస్తాం.” అని రాహుల్ అన్నారు.









