AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వినాయక చవితి ఎఫెక్ట్‌.. నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

వినాయకచవితి సందర్భంగా మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. పండగ సామాగ్రి, గణపతి విగ్రహాల కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రధాన రహదారుల్లో రోడ్డుపక్కన గణనాథుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో.. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రధానంగా.. పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్‌, భాగ్యలత, ఆటోనగర్‌, ఉప్పల్‌, నాగోలు, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విగ్రహాల కొనుగోలు కోసం వచ్చిన భక్తులు తమ వాహనాలను రోడ్లపై నిలపడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ANN TOP 10