AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌కు సోనియా, ఠాక్రే.. ఘన స్వాగతం

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శనివారం సోనియాతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి కేసీ వేణుగోపాల్, ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పెద్దల రాక సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున కార్గే తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, కళా బృందాలతో కాంగ్రెస్ పెద్దలకు టీ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.

హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయి. రేపు సాయంత్రం తుక్కగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో సోనియా గాంధీ సహా అగ్ర నేతలంతా పాల్గొంటారు.

ANN TOP 10