AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు.. ఈ సారి ఎవరంటే..?

బీఆర్‌ఎస్‌లో సీటు వస్తుందని ఆశించి బంగపడ్డ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు కరీంనగర్‌ ప్రెస్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

2019లో బీఆర్‌ఎస్‌ లో చేరిన తాను అధిష్టానం చెప్పిన ప్రతి బాధ్యతనూ.. శక్తి వంచన లేకుండా చేశానని పేర్కొన్నారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో, కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం శ్రమించానని తెలిపారు. దీనితో పాటు అధిష్టానం చెప్పిన పనిని విధేయతతో నెరవేర్చానని అన్నారు. ఇక మానకొండూరు ఎమ్మెల్యే వ్యవహర శైలిపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ఆరెపల్లి మోహన్‌ వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేసే పరిస్థితులు లేకపోవడంతో.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత లేనందునే రాజీనామా చేశానని.. త్వరలో తన కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ANN TOP 10