AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోమటిరెడ్డిని కలిసిన జిట్టా బాలకృష్ణారెడ్డి..

తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంపీ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం జిట్టా బాలకృష్ణారెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆయన రేవంత్‌తో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకోగా తాజాగా ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ కావడం విశేషం.అయితే, జిట్టా సొంత నియోజకవర్గం భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లపై భరోసా లభించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభ సందర్భంగా కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ANN TOP 10