AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

పసిడి ప్రియులకు మంచి సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు. గోల్డ్, సిల్వర్ రేట్లు వరుసగా పడిపోతూ కొనేందుకు ఇదే మంచి సమయమని సంకేతాలు ఇస్తున్నట్లు ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా వరుస పతనం మనం చూడొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో, దేశీయ మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. అయితే ఈ శ్రావణ మాసం ఆఖరి రోజుల్లో బంగారం ధర భారీగా దిగొస్తుంది. గత 10 రోజుల్లో చూస్తే గోల్డ్ రేటు కేవలం రెండు రోజుల్లో మాత్రమే పెరిగింది. ఇక ఏకంగా 6 రోజులు పడిపోగా.. ఇవాళ మాత్రం కుప్పకూలింది. దీంతో కొనేవారికి ఇప్పుడు మంచి సమయం అని అంటున్నారు నిపుణులు.

హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు..
దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో చూస్తే పసిడి రేట్లు భారీగా పతనం అయ్యాయి. ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ఏకంగా రూ. 340 పడిపోయి 10 గ్రాములకు రూ.54,500 మార్కుకు చేరింది. కిందటి రోజు ఇది స్థిరంగా ఉండేది. 5 రోజులుగా వరుసగా పడిపోయింది. గత 10 సెషన్లలో రెండు రోజుల్లోనే పెరిగింది. సెప్టెంబర్ 4న రూ. 55,300గా ఉన్న రేటు ఇవాళ రూ.54,500కి చేరిందంటే.. రూ. 800 తగ్గింది.

దేశ రాజధాని దిల్లీలో కూడా బంగారం ధర తగ్గుతూనే ఉంది. ఇక్కడ 22 క్యారెట్ల పుత్తడి రేటు తాజాగా రూ.340 పడిపోగా 10 గ్రాములకు రూ.54,650 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 దిగిరాగా.. 10 గ్రాములపై రూ.59,600 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ కూడా గత 10 రోజుల్లో చూస్తే బంగారం ధర 6 రోజులు పడిపోతూనే ఉంది.

సిల్వర్ రేట్లు రూ. 1000 డౌన్..
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పతనం అవుతున్నాయి. ప్రస్తుతం దిల్లీ మార్కెట్‌లో కిలోపై రూ.1000 తగ్గి రూ. 73,500 మార్కు వద్ద కొనసాగుతోంది. క్రితం రెండు రోజుల్లో 1000 పెరిగినా ఇప్పుడు ఒక్కరోజులోనే పడిపోయింది. ఈ నెలలో సుమారు రూ. 4వేల వరకు వెండి రేటు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కూడా వెండి ధర రూ.1000 తగ్గి ప్రస్తుతం కిలోకు రూ. 77 వేల మార్కు వద్ద కొనసాగుతోంది.

ANN TOP 10