AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపే టెట్ పరీక్ష.. కీలక సూచనలు చేసిన అధికారులు

తెలంగాణలో సెప్టెంబరు 15న టెట్‌(టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌)-2023 పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇందుకోసం ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు. సీసీటీవీ కెమెరాల నిఘాలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష జరగనుంది. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 2052 వరకు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో పేపర్‌-1కు 1139 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అలాగే పేపర్‌-2 పరీక్ష నిర్వహణ కోసం 913 కేంద్రాలను కేటాయించారు. ఇదిలా ఉండగా.. టెట్ పరీక్షకు సంబంధించి ‘పేపర్‌-1’ పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే ‘పేపర్‌-2’పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటూ 4,78,055 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షకు హాజరుకానున్నాయి.

అలాగే ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 2052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులను నియమించనున్నారు. అలాగే 2052 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లు కూడా నియమించనున్నారు. అంతేకాదు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు కూడా పరీక్ష ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. అలాగే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలను చీఫ్‌ సూపరింటెండెంట్‌ రూంలో ఏర్పాటు చేసేలా.. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా.. అలాగే ఎలాంటి విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వైద్య సిబ్బందిని. మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచనలు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి వచ్చేటట్లు.. ఆయా రూట్లలో బస్సు సౌకర్యాలు కల్పించాలని.. ఆర్టీసీ సంస్థను విద్యాశాఖ అధికారులు కోరారు.

ANN TOP 10