AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాదులో కాంగ్రెస్ విజయభేరి సభ… అనుమతిచ్చిన పోలీసులు

ఈ నెల 17న తుక్కుగూడ వద్ద సభ
హాజరుకానున్న మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్!

హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. విజయభేరి పేరిట జరిపే ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ సభ తుక్కుగూడలో ఈ నెల 17న జరగనుంది. దీనిపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పందించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపారు.

కాగా, ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తుండడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ANN TOP 10