AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీ టికెట్లపై క్లారిటీ ఇవ్వాలని రేవంత్‌ని కోరిన కొండా సురేఖ

కాంగ్రెస్ పార్లమెంటు పార్టీ సమావేశంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వరంగల్‌లో టికెట్ల పంచాయతీని తేల్చాలని సభావేదికపైనే రేవంత్‌ను కోరారు.ఎవరికి వారు టికెట్లు తమకే అని ప్రకటించుకుంటున్నారు.. ఈటికెట్ల గోలకు అడ్డుకట్ట వేయాలని రేవంత్‌రెడ్డిని కోరారు. కొండా సురేఖకు ఇస్తే ఇస్తామని చెప్పండి లేదంటే ఇవ్వమని ప్రకటించండి అని చెప్పారు. ఎవరికీ టికెట్ ఇచ్చినా అంతా కలిసి కట్టుగా పనిచేయాలి.కొండా సురేఖ వ్యాఖ్యలు ఈ సమావేశంలో చర్చనీయాశంగా మారాయి.

ANN TOP 10