ఆసియాకప్‌లో నేడు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో.. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో నేడు ఒక మార్పు చేశారు. స్పీడ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని లంక కెప్టెన్ శనక తెలిపాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టుతోనే .. నేడు కూడా ఆడనున్నట్లు శనక పేర్కొన్నాడు. స్పిన్నర్ వల్లలాగే, సమరవిక్రమ, మతీశ పతిరణ బాగా ఆడుతున్నట్లు కితాబు ఇచ్చాడు. ప్రస్తుతం సూపర్ ఫోర్ స్టేజ్‌లో ఇండియా రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పాక్, లంకకు కూడా రెండు పాయింట్లే ఉన్నా.. ఇండియా రన్ రేట్ మెరుగ్గా ఉంది. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇండియా 228 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
