నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయింది. సోమవారం రాత్రి (సెప్టెంబర్ 11) హాస్టల్‌లో భోజనం చేసిన విద్యార్థినులు అర్ధరాత్రి దాటిన తర్వాత కడుపునొప్పికి గురి కావటంతో పాటు వాంతులు చేసుకున్నారు. వెంటనే స్పందించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది.. వారిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా.. వారిలో 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరామర్శించారు. విద్యార్థినులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అందించి వారికి నయమయ్యేలా చికిత్స అందుతుందన్నారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలు తెలుసుకుంటామని.. దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.