చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతం కావడంతో ప్రపంచదేశాలన్ని భారత్‌ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇటీవల సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్1 ను కూడా విజయంతంగా ప్రయోగించింది. అయితే ఇప్పుడు భారత్ మరో సరికొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. అదే సముద్రయాన్. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులో కీలకమనటుంటి జలంతర్గామి మత్స్య-6000 తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఆ సబ్ మెరైన్ ఫోటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే సముద్ర గర్భ అన్వేషణలో భాగంగా తోడ్పడే మానవ సహిత జలంతర్గామి ఇదేనని పేర్కొన్నారు. అయితే ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇక ఈ ప్రాజెక్టు మొదలైనట్లైతే భారతదేశంలో మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కుతుంది.
సుముద్రంలోకి వెళ్లే ఆక్వానాట్లను ఆరు వేల మీటర్ల లోతు వరకు తీసుకువెళ్లడానికి ఓ గోళాకార నౌకను నిర్మించనున్నారు. ముందుగా ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మిషన్ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇక తదుపరి ప్రయాణం సముద్రయాన్. ఇది చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో అభివృద్ధి అవుతున్న మత్స్య-6000 జలాంతర్గామి. ఇండియా చేపడుతున్నటువంటి తొలి మానవ సహిత డీప్ ఓషన్ సముదద్రయాన్‌లో భాగంగా దీన్ని తయారుచేస్తున్నారు. అయితే జలాంతర్గామిలో ముగ్గురు కూర్చోని.. సుమారు 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు. దీనివల్ల సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని సైతం అధ్యయనం చేయవచ్చు. అయితే ఈ వ్యవస్థ సముద్ర పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగించదని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.