హైదరాబాద్ లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జమిలి ఎన్నికలు జరగవని అన్నారు. అసెంబ్లీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగవని కిషన్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జమిలి ఎన్నికలపై కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జమిలి ఎన్నికలు వస్తాయని, అసెంబ్లీకి లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో తెలంగాణలో జమిలి ఎన్నికలు జరగవని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీకి, లోక్ సభకు వేర్వేరుగానే ఎలక్షన్స్ జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయన్న కిషన్ రెడ్డి.. మీ పని మీరు చేసుకుపోండి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలి అంటూ పార్టీ నేతలకు డైరెక్షన్స్ ఇచ్చారు కిషన్ రెడ్డి. జమిలి ఎన్నికలు ఉండవు అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో డిస్కషన్ కు దారితీశాయి.









