AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది వెంటే మహిళాలోకం

శ్రీనన్నసేవానిరతికి నీరాజనం
ప్రెజర్‌ కుక్కర్ల పంపిణీకి అనూహ్య స్పందన

ఆదిలాబాద్‌: ఎన్నారై, కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్, కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు నియోజకవర్గంలో మంచి స్పందన కన్పిస్తోంది. ఇప్పటికే నిత్యాన్నదానం , ఆంబులె¯Œ ్స తాగునీరు, పెళ్లికానుకలు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన కంది శ్రీనివాస రెడ్డి తాజాగా మహిళలకు ప్రెషర్‌ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. వారిని తన తోబుట్టువులుగా భావించి ఒక అన్నగా చిరుకానులు అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అనేక కాలనీల్లో పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్‌ పట్టణం 24 వవార్డులోని నేరటివాడ లో కుటుంబ సభ్యులతో హాజరై మహిళలకు ప్రెజర్‌ కుక్కర్లు అందించారు. ప్రజలకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే అమెరికా నుంచి ఆదిలాబాద్‌ కు వచ్చినట్టు కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. తాను తన సొంత డబ్బులతో సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు.

తన సంపాదనలో సగం ఆదిలాబాద్‌ ప్రజల కోసం ఖర్చు పెడతానని తన కుటుంబంతో ముందే చెప్పానని అన్నారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. కాని స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తనకు అడుగడుగునా అడ్డు తగులున్నారన్నారు. ప్రజలకు మంచి చేద్దామని ముందుకొస్తే ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. తను తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించారని అన్నారు. కుక్కర్ల పంపిణీ అడ్డుకునేందుకు గౌడౌన్‌ ను సీజ్‌ చేయించారని తెలిపారు. అన్ని బిల్లులు సక్రమంగానే ఉన్నకారణంగా తిరిగి పంపిణీ చేస్తున్నానన్నారు. తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఎవరెంత అడ్డుకున్నా తనను ఆదిలాబాద్‌ ప్రజలనుంచి ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేసారు.

మరోవైపు తన భర్త ఆలోచనలన్నీ నిత్యం ఆదిలాబాద్‌ ప్రజల గురించే అని కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా రెడ్డి అన్నారు. ఆయన ఇంటిలో ఉండేది చాలా తక్కువన్నారు. ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై ఉంటారన్నారు. వారి సమస్యలు,వారికి ఏంచేస్తే మంచి జరుగుతుదని పలువిధాలుగా తపన పడుతుంటారని ఆమె తెలిపారు. అందుకే మీ మంచి కోసం పరితపించే తన భర్తను ఈ ఎన్నికలలో మీ ఓట్లతో ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు. అటు తన కొడుకు చిన్నప్పటినుంచి కష్టపడి పైకొచ్చారని, అందకే సాటిప్రజల కష్టం తెలుసన్నారు. అతనికి ఓటు వేసి గెలిపించి ఆదిలాబాద్‌ ప్రజలకు ఇంకా మరిన్ని మంచి పనులు చేసే అవకాశం ల్పించాలని కంది శ్రీనివాస రెడ్డి మాతృమూర్తి కంది అనసూయ కోరారు. కార్యక్రమం లో గిమ్మ సంతోష్, షకీల్, కొండూరి రవి, ముఖీమ్, మానే శంకర్, నాగన్న, మొహమ్మద్‌ అహ్మద్‌ అలీ, జుబేర్, ఆశ రెడ్డి, కర్మ,అంజద్‌ ఖాన్, అస్బాత్‌ ఖాన్, చందు, గణేష్‌ రెడ్డి, గోక చిన్నన్న, ఈశ్వర్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10