ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
శ్రీనన్న సమక్షంలో జోరుగా చేరికలు
ఆదిలాబాద్: పేదలకు ఒక కొత్తరేషన్ కార్డు కూడా ఇవ్వలేని జోగురామన్న వారి సంక్షేమాన్ని ఎలా పట్టించుకుంటాడని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయన సమక్షంలో పార్టీలోకి చేరికలు రోజు రోజుకు జోరందుకుంటున్నాయి. ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ,నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యేజోగు రామన్నను ప్రశ్నిస్తున్నతీరు ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కంది శ్రీనివాస రెడ్డి పడుతున్న తపన చూసి జనం మేము సైతం నీవెంటే అంటూ కదంతొక్కుతున్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్ లో షేక్ మోసిన్ , రవూఫ్ ఖాన్ షేక్ సుల్తాన్ ,షేక్ సద్దాం ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమానికి కంది శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాణసంచా పేల్చి బ్యాండుమేళాలతో, పూలు చల్లుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కంది శ్రీనివాస రెడ్డి రాకను పురస్కరించుకొని కాలనీ వాసులు చప్పట్లతో తమ స్పందన తెలియచేసారు.

అనంతరం పెద్ద సంఖ్యలో ఖుర్షీద్ నగర్ కాలనీ వాసులు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.వారందరికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక వైపు చిరుజల్లులు కురుస్తున్నా కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా సాగింది. అభిమానుల నినాదాలు ,కేరింతలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఇదే ఊపు కొనసాగించి కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీ తో గెలిపిస్తామని కాలనీ వాసులు అన్నారు. అధికారం ఉపయోగించుకొని జోగు రామన్న సభకు కరెంట్ కట్ చేయించాడని కాని జనం తన పవర్ కట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసారు.పధ్నాగేళ్లుగా ఎమ్మెల్యే రామన్న నిద్ర పోతున్నాన్నడని ఆరోపించారు. మైనారిటీలకు లక్షరూపాయలిస్తానని నాటకమాడాడని, బియ్యంకార్డు కూడా ఇవ్వని జోగురామన్న లక్షరూపాయలు ఇస్తడా అని ఎద్దేవా చేసారు. అన్ని అబద్ధపు హామీలిచ్చి మాట తప్పిన జోగురామన్న ఒక జూటారామన్న అని అన్నారు. ప్రజల కోసం చేసిందేమీలేదు కాని పట్టణంలో 70లక్షలతో డబ్ల్యూ కన్వెన్షన్ , చాందా వద్ద 100కోట్లతో ఓక్లే స్కూల్ ఎలా కట్టావో ప్రజలకు తెలుసన్నారు. ఈ సొమ్మంతా ఆదిలాబాద్ ప్రజలను దోచుకొని సంపాదించిందేనని ఆరోపించారు. ఇలాంటి స్వార్థ పరుడైన ఎమ్మెల్యేను చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లోకూర్చోబెట్టాలన్నారు.
ఇక జోగురామన్న పాయల్ శంకర్ ఒక్కటేనని ఇద్దరూ ఒకటేనని విమర్శించారు.కలిసి దందాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వారిద్దరిలో ఎవరికి ఓటేసినా అది మురికి కాలువలో పడ్డట్టే అని అన్నారు. జోగురామన్నను ఓడించడానికి ఎంతమంది సిద్ధం అంటూ కంది శ్రీనివాస రెడ్డి ఇచ్చిన పిలుపుకు జనమంతా చేతులెత్తారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు వెదజల్లి గెలువాలనుకుంటున్న జోగురామన్నకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ఆయనిచ్చే డబ్బులు తీసుకొని ఓటు మాత్రం చేతి గుర్తుకు వేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీమాత్రమే పేదలకు ఇండ్లిచ్చిందని గుర్తు చేశారు. మసూద్ అహ్మద్, సీఆర్ సీఆర్ ల హయాంలో 30వేల ప్లాట్లు గరీబోళ్లకు పంచారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అందుకే కాంగ్రెస్ కు ఒక్క అవకాశమివ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లను ప్రజలకు విరించారు. నాలుగుసార్లు జోగురామన్నకు అవకాశమిచ్చారని తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. తనకు అందరి ఆశీర్వాదం కావాలని కంది శ్రీనివాస రెడ్డి ప్రజలను అభ్యర్థించారు.










