భారత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కోసం సంవత్సరం నుంచి ఎదురుచూస్తోంది. ఈ రోజును సక్సెస్ చెయ్యడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత్ గొప్పదనాన్ని చాటాలి అనుకుంటోంది. ఇవాళ జరిగే జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోవాలని కేంద్రం పక్కా ప్లాన్ ప్రకారం అంతా చేస్తోంది.
మన భూమి, మన దేశం అనే ఆలోచన కంటే.. ప్రపంచమే మన ఇల్లు, ఒకటే భూమి, అందరం ఒక్కటే, వసుధైక కుటుంబం అనే ఆలోచనలు విస్తృతమైనవి. ఇదే అంశంతో కేంద్ర ప్రభుత్వం జీ20 గ్రూప్ దేశాల శిఖరాగ్ర సదస్సును ఢిల్లీలో ఇవాళ (శనివారం), ఆదివారం నిర్వహించబోతోంది.
ఇవాళ్టి సదస్సుకి మదర్ ఆఫ్ డెమొక్రసీ భారత్ అనే థీమ్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ కాబట్టే.. ఈ అంశాన్ని కేంద్రం బలంగా వినిపిస్తోంది. మరి ఇవాళ షెడ్యూల్ ఎలా ఉంటుందో చూద్దాం.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ సదస్సు హాల్లో ఒకే భూమి అంశంపై చర్చ ఉంటుంది. దీనిపై ప్రధానమంత్రి స్పీచ్ ఇస్తారు. ఈ చర్చ తర్వాత మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది.
మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వకూ లెవెల్-1లో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయి. మధ్యాహ్నం 3 నుంచి 4.45 మధ్య ఒకే కుటుంబం అనే అంశంపై చర్చ ఉంటుంది. అక్కడితో ఇవాళ్టి సదస్సు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి దేశాల అధినేతలు.. తమకు కేటాయించిన హోటల్స్కి వెళ్లిపోతారు.









