AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విశాల్

కొందరు నిర్మాతల వ్యవహారశైలి వల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగుతోందని హీరో విశాల్ అన్నాడు. తాను నిర్మాతగా మారడానికి కూడా కొందరు నిర్మాతల వ్యవహారశైలే కారణమని చెప్పాడు. తన సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి నిర్మాతలు ఇబ్బంది పెట్టేవారని… శుక్రవారం సినిమా రిలీజ్ అంటే గురువారం రాత్రి తనను బ్లాక్ మెయిల్ చేసేవారని తెలిపాడు. ఫైనాన్సియర్ కి డబ్బులు చెల్లించలేదని, సినిమా రిలీజ్ కాదని చెప్పి, తనతో డబ్బులు కట్టించేవారని చెప్పాడు. సరిగ్గా రెమ్యునరేషన్ కూడా ఇచ్చే వాళ్లు కాదని మండిపడ్డాడు. ఇలాంటి ఇబ్బందులు తాను ఎన్నో చూశానని… అందుకే నిర్మాతగా మారానని చెప్పాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీని ప్రారంభించి, మంచి కథలతో సినిమాలను నిర్మిస్తూ, నిర్మాతగా నిలబడ్డానని తెలిపాడు. విశాల్ వ్యాఖ్యలపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ANN TOP 10