ఈ తెల్లవారు జామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిబూడిదైంది. నల్గొండ జిల్లా.. మిర్యాలగూడెం మండలం.. కిష్టాపురం దగ్గర ఏసీ బస్సులో మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్టైన డ్రైవర్, సిబ్బంది.. నిద్రపోతున్న ప్రయాణికులను లేపి.. బస్సు నుంచి దింపేశారు. అప్పటికే మంటల్లో ఉన్న బస్సు.. పూర్తిగా కాలి బూడిదైంది. ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు.
నార్కట్ పల్లి – అద్దంకి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఏసీలో సాంకేతిక లోపం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే.. ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.