తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. స్పెషల్ టైప్ కాటేజీల సమీపంలో ఓ చిరుత..శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ రెండు చిరుతలను ట్రాప్ చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఐదు చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంధించిన విషయం విదితమే. కాగా, జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28, సెప్టెంబర్ 6వ తేదీల్లో మొత్తం ఐదు చిరుతలను బంధించారు.
