AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎవరెన్ని కుట్రలు చేసినా సేవ ఆగదు

– తన సంపాదనలో సగం ప్రజాసేవకే..
– కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కంది శ్రీనివాసరెడ్డి
– కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రెషర్‌ కుక్కర్ల పంపిణీ
– పెద్ద సంఖ్యలో కదిలివచ్చిన మహిళాలోకం

ఆదిలాబాద్‌: ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్నారై, కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కంది శ్రీనివాస రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. మహిళలకు ఒక అన్నగా చిరుకానుకలు అందిస్తున్నారు. గురువారం ఆదిలాబాద్‌ పట్టణంలోని మహాలక్ష్మి వాడ 1వ వార్డులో ప్రెషర్‌ కుక్కర్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ ప్రజలకు సేవచేయాలన్న ఉద్దేశంతోనే ఫౌండేషన్‌ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడ్తున్నామని స్పష్టం చేశారు. అమెరికాలో మంచి విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవచేయాలనే ఇక్కడికొచ్చినట్టు ఆయన తెలిపారు.

సాధారణ రైతుకుటుంబంలో పుట్టి పెరిగిన తను సొంత కష్టం తోనే ఈ స్థాయికొచ్చినట్టు తెలిపారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్నిరకాల పౌష్టికాహార లోపాలను దూరం చేయాలనుకొన్న ఉద్దేశంతో తన సతీమణి ఇచ్చిన సలహాతో కుక్కర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.తన ఫౌండేషన్‌ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న పలు కుట్రలు పన్నుతున్నట్టు ఆరోపించారు. తమ కాలనీకి వచ్చి కుక్కర్లు పంచిన కంది శ్రీనివాస రెడ్డి సేవాగుణాన్ని కొనియాడుతూ కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గిమ్మ సంతోష్, షకీల్, రాజ్‌ మొహమ్మద్, షేక్‌ మన్సూర్, కర్మ, రామ్‌ రెడ్డి, అంజద్‌ ఖాన్,అస్బాత్‌ ఖాన్,దర్శనాల చంటి, హరీష్‌ రెడ్డి, నాగన్న, మహమూద్, అఖిమ్,అశోక్, పోతరాజు సంతోష్, ఉగ్గె సంతోష్, కాలనీ వాసులు దమ్మనంద్, విట్టల్, బాపూరావు, మిలిన్, సందీప్, విశ్వకాంత్, దత్తు, సుమిత్, సుమన్‌ బాయి, వెంకటమ్మ, అనసూయ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10