దేశ సమగ్రత కోసమే రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాస్‌రెడ్డి
బేల : రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర దేశ చరిత్రలోనే ఒక సంచలనమని కాంగ్రెస్ రాష్ట్రరాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 7న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 145 రోజుల పాటు 4,081 కిలోమీటర్లు కొనసాగిన ఈ యాత్ర దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని ప్రజలకు చేరవేసిందన్నారు. యాత్ర మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, కేఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండాల రెపరెపలతో పాదయాత్ర ఆధ్యంతం త్రివర్ణ శోభితమైంది.
నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలను ఏకం చేయాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ను చేపట్టి అనుకున్నది సాధించారన్నారు. విచ్చిన్నకర, విభజనకర రాజకీయాలకు పాల్పడ్తున్న కేంద్ర పాలకుల దమన నీతికి రాహుల్ గాంధీ యాత్ర చెంపపెట్టు లాంటిదన్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఈ యాత్ర ఒక కదలిక తెచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడటం ఖాయమన్నారు. ఆదిలాబాద్ నియోజక వర్గంలో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న దోపిడీని రాబోవు ఎన్నికల్లో అంతం చేద్దామన్నారు.
ఆయనను చిత్తుచిత్తుగా ఓడించాలని, కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీ తో గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో గిమ్మ సంతోష్, ఎంఏ షకీల్,రాజ్ మొహమ్మద్, షేక్ మన్సూర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజయ్ గుండవార్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మడవి చంద్రకాంత్, మాజీ మండల అధ్యక్షుడు బాపూరావు హుల్కె, శంకర్ బొక్రె, రాజ్ మాహ్మద్, కర్మ, రామ్ రెడ్డి, అంజద్ ఖాన్, అస్బాత్ ఖాన్, దర్శనాల చంటి, హరీష్ రెడ్డి, నాగన్న, మహమూద్, అఖిమ్, అశోక్, పోతారాజు సంతోష్, ఉగ్గె సంతోష్ ప్రదీప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇట్టడి సురేష్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.