AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టికెట్ రేసులో సర్పంచ్ నవ్య.. నేడు బీఆర్‌ఎస్‌ పెద్దల వద్దకు..

స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్ రేసులో తాను సైతం అని జానకిపురం సర్పంచ్ నవ్య అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధినేత కేసీఆర్‌కు ఆమె అర్జీ పెట్టుకుంటున్నారు. రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు టికెట్ రేసులో కడియం శ్రీహరి, రాజయ్యతో నవ్య కూడా పోటీపడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. కాబట్టి తనకు అవకాశం ఇవ్వండని నవ్య వేడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులను నవ్య దంపతులు కలవనున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టిక్కెట్టు కోసం పోటీ పడడంపై ప్రజలలో చర్చ జరుగుతోంది.

ANN TOP 10