AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవ్‌ పార్టీ భగ్నం.. భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. దొరికిన వాళ్లలో టాలీవుడ్ నిర్మాత

హైదరాబాద్‌ అడ్డాగా ఇంకా డ్రగ్స్‌ దందా కొనసాగుతూనే ఉంది. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రైడ్ చేశారు. అక్కడున్న వాళ్లలోసెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు అధికారులకు పట్టుబడ్డారు. నిందితుల దగ్గర నిషేధిత డ్రగ్స్ గుర్తించిన అధికారులు రేవ్ పార్టీని భగ్నం చేసి అందర్ని అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులకు చిక్కిన వాళ్లలో ఓ టాలీవుడ్ నిర్మాతతో పాటు కొందరు యువతులు ఉన్నారు. అయితే వీళ్లకు ఎవరు సప్లై చేశారు..? ఎక్కడి నుంచి వచ్చిందని ?ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ డ్రగ్స్ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని కూపీ లాగుతున్నారు.

ఈ నగరానికి ఏమైంది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ పట్టుబడటం మరోసారి సంచలనంగా మారింది. మాదాపూర్‌లో రేవ్ పార్టీ ముసుగులో జరుగుతున్న డ్రగ్స్‌ దందాకు నార్కోటిక్ బ్యూరో అధికారులు రైడ్ చేసి చెక్ పెట్టారు. పార్టీలో డ్రగ్స్‌ వాడుతున్న వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో ఈ రేవ్‌ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. అక్కడున్న వాళ్లను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి దగ్గర నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10