చిరుత పులిని చూస్తేనే ఎంతటి ధైర్యవంతులకైనా గుండెలు జారిపోతాయి. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఇక్లేరా గ్రామంలోని కొందరు ఓవరాక్షన్ చేశారు. చిరుత పులి మీదకు రావడం లేదన్న ధైర్యంతో ఆ మూగ జీవంపై స్వారీ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ ఫోజులిచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఒక వన్య ప్రాణి విషయంలో ఇలా ప్రవర్తించిన ఈ గ్రామస్తుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మృగం ఆ చిరుత కాదని, అక్కడ చిరుతతో అలా అమానుషంగా ప్రవర్తించిన మనుషులే మృగాలని నెట్టింట మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
