తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పోటీపై కమిటీ వేశామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమయం మించిపోయిందని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
