పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో హీటు పడుతుంది. ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్న స్థాయిలో హిట్టు కొట్టలేకపోయింది. 2017లో పంజాబీ చిత్రం చన్నా మెరెయాతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికల్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతుండటంతో జోరుగావైరల్ అవుతున్నాయి.